Prabhas Raja Saab రాజా సాబ్ కు ఏం జరుగుతోంది..?

Update: 2026-01-02 10:57 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాజా సాబ్. ఒక వారం రోజుల్లో విడుదల కాబోతోంది ఈ మూవీ. బట్ ఆ మేరకు ఆకట్టుకునే ప్రమోషన్స్ మాత్రం కనిపించడం లేదు. ఓ రకంగా చూస్తే ప్రభాస్ సినిమానే లైట్ తీసుకున్నాడు అనిపించేలా ఉంది. లేదంటే ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రమోషన్స్ అస్సలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు చూస్తే కేవలం ఇదో తెలుగు సినిమా అన్నట్టుగా ఉంది. అంతే కాదు.. అటు తమిళ్, కేరళ, కర్ణాటకతో పాటు బాలీవుడ్ లో కూడాఈ మూవీకి సంబంధించి మినిమం ప్రమోషన్ కూడా కనిపించడం లేదు. అసలు పట్టించుకోలేదు. ఈ మూవీ గురించి ఎవరూ ఇతర భాషల వాళ్లు అసలేం మాట్లాడ్డం లేదు అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఏం ఉంది.

రాజా సాబ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా పెద్దగా క్రేజ్ లేదు అన్నట్టుగా ఉంది. లేదంటే వాళ్లు కనీసం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ గురించి ఏం మాట్లాడ్డం లేదు. ఏదో ప్రభాస్ మూవీ తెలుగులో వస్తోంది కాబట్టి తెలుగు వాళ్లుగా చూస్తాం తప్ప అన్నట్టుగా ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు మారుతి మినిమం క్రేజ్ తెచ్చే ప్రయత్నం ఏం చేయడం లేదు. అసలీ మూవీపైనే పెద్దగా నమ్మకం లేనట్టుగానే ఉన్నాడు అతను. ఏదో తెలుగు మూవీస్ లాగా మినిమం గ్యారెంటీ అనిపించేసేలా ఉన్నాడు. ఇతర భాషల్లో అతని గురించి ఎవరికి మినిమం కూడా ఎవరికీ తెలియదు. సో.. ప్రభాస్ తప్పుకున్నాడు అంటే ఇది కేవలం తెలుగు సినిమాగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తోంది. అటు నిర్మాత విశ్వ ప్రసాద్ పై కూడా ఈ మూవీపై పెద్దగా నమ్మకం లేనట్టుగానే కనిపిస్తున్నాడు. ఓటిటి బిజినెస్ విషయంలోనే చాలా బేరాలు సాగాయి తర్వాతే మినిమంగా అయిందనే టాక్ కూడా ఉంది. పైగా ఈ మధ్య అతని మూవీస్ అన్నీ పోతున్నాయి. ఆ కారణంగా ఈ మూవీ ప్రమోషన్స్ కు కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడా అనిపిస్తున్నాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రభాస్ పని ఐపోయినట్టుగానే కనిపిస్తోంది. ఇతర భాషల్లో మాత్రం అసలేం పట్టించుకోవడం లేదు. ఆ విషయంలో కూడా ప్రభాస్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది. మరోవైపు స్పిరిట్ మూవీ షూటింగ్ లో మినిమం గ్యాప్ లేకుండా చేస్తున్నాడు. అతను కనీసం ఒక వారం రోజుల పాటు ప్రమోషన్స్ పై కాన్ సెంట్రేట్ చేస్తే తప్ప ఈ మూవీ నిలబడటం గ్యారెంటీ అనేలా లేదు. ఏదేమైనా రాజా సాబ్ ప్రమోషన్స్ విషయంలో బజ్, క్రేజ్, హైప్ అస్సలు కనిపించడం లేదు. ఫ్యాన్స్ లో ఇదో పెద్ద సమస్యగా మారడం తప్ప ఇంకేం లేదు. 

Tags:    

Similar News