సుహాస్, శివానీ జంటగా నటించిన మూవీ హే బలవంత్. ఈ మూవీకి ముందుగా హే భగవాన్ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ పై సెన్సార్ వాళ్లు అభ్యంతరం పెట్టడంతో బలవంత్ గా మార్చారు. అంత వరకు బానే ఉంది. కానీ ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇదేంటీ ఏ సర్టిఫికెట్ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా శివానీ అంటే ఎక్స్ పోజింగ్ కే దూరంగా ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకే పాత్ర కూడా అలాగే ఉండదు అని అర్థం అవుతుంది. అయినా ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు అనేదే అనుమానం.
ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. పాత్రలు ప్రవర్తించే విధానం, డైలాగ్స్ లో బూతు లేదా డబుల్ మీనింగ్, పాటల్లో బూతులు, ఎక్స్ పోజింగ్, విపరీతమైన వయొలెన్స్ ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో అవన్నీ ఏం కనిపించవు అనిపించేలా ఉంది. అయినా ఆ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే కేవలం టైటిల్ వల్లే అనుకోవచ్చు. అలా అనుకున్నా టైటిల్ మార్చారు కదా అనిపిస్తుంది.
రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ టైటిల్ కి కూడా ఇలాంటి కారణంతోనే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు హే బలవంత్ టైటిల్ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందా లేదా అనేది తెలియాలి. ఏదేమైనా సెన్సార్ వాళ్ల తీరు ఒక్కోసారి అర్థం కాదు.
ఇక ఈ మూవీ ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఒక రోజు ముందుగానే సినిమాపై నమ్మకంతో ప్రీమియర్స్ వేస్తున్నారు. సుహాస్, శివానీతో పాటు సీనియర్ నరేష్, సుదర్శన్, హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. బి నరేందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రానికి గోపి ఆచంట దర్శకుడు.