Ajith Kumar : ఇంతకీ అజిత్ మూవీ ఎలా ఉంది..?

Update: 2025-04-11 12:05 GMT

అజిత్ కుమార్ కు తమిళనాట ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. స్టార్ హీరోగా అతని చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక తన ఫ్యాన్ గా చెప్పుకున్న ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో అతను నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చింది. తమిళ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం తేలిపోయింది అని చెప్పాలి. ఆ మాటకొస్తే తమిళ్ లో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రమే అంటున్నారు చాలామంది. ఓవర్ ద బోర్డ్ అనిపించే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం కొన్నాళ్ల క్రితం అజిత్ నటించిన విశ్వాసంకు కాస్త దగ్గరగా ఉండటం విశేషం. అందులో కూతురును కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం. అప్పటికే భార్య భర్త విడిపోయి ఉంటారు. ముఖ్యంగా భార్య అతన్నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇందులోనూ అంతే. సింపుల్ గా కథగా చూస్తే..

అజిత్ ఓ కరడుగట్టిన గ్యాంగ్ స్టర్. తనకు కొడుకు పుట్టిన టైమ్ కూ రక్తపాతంతో కనిపిస్తాడు. అది చూసిన భార్య (త్రిష)ఈ రక్తం కడిగేసుకున్న తర్వాతే నా కొడుకు వద్దకు రావాలని చెబుతుంది. దీంతో తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని పోలీస్ లకు సరెండర్ అవుతాడు. ఇకపై గ్యాంగ్స్ స్టర్ గా ఉండకూడదు అని నిర్ణయించకుంటాడు. ఇటు త్రిష పుట్టిన కొడుకును తీసుకుని స్పెయిన్ వెళ్లిపోతుంది. అక్కడ విదేశాంగ శాఖలో ఉద్యోగిగా ఉంటుంది. అజిత్ 18యేళ్ల తర్వాత రిలీజ్ అయ్యి కొడుకును చూడ్డానికి వెళితే.. అక్కడ కొడుకును కొందరు డ్రగ్స్ కేస్ లో ఇరికించి అరెస్ట్ చేయిస్తారు. ఆ కొడుకును విడిపించుకునేందుకు అతను మళ్లీ గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తాడా లేక లీగల్ గా వెళ్లాడా అనేది కథ.

ఈ కథను కంగాళీగా చెప్పాడు దర్శకుడు. కేవలం అజిత్ ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేస్తే చాలు అనే కోణంలోనే కనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ అరవ అతి ఉంటుంది. అది తెలుగు ప్రేక్షకులను మరింత ఇబ్బంది పెడుతుంది. ఇక సినిమాలో పాత పాటల రిఫరెన్స్ లు చాలా ఉన్నాయి. అవేవీ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అంచేత అసలీ పాటలేంటా అనిపిస్తుంది. మొత్తంగా అజిత్ ఫిబ్రవరిలోనే పట్టుదల మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. ఇప్పుడు తెలుగులో మరోటి. కాకపోతే ఇది తమిళ్ లో హిట్ అనిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Tags:    

Similar News