Akkada Ammayi Ikkada Abbayi : ప్రదీప్ సినిమా పరిస్థితేంటీ..?

Update: 2025-04-12 08:30 GMT

ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ గా తిరుగులేని టైమింగ్ ఉన్నవాడు. డ్యాన్సర్ కూడా. మధ్యలో కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల డ్యాన్స్ కు దూరమయ్యాడు. యాంకర్ గా మాత్రం బుల్లితెర మెగాస్టార్ అనే చెప్పాలి. అతని టైమింగ్ ఇంకెవరికీ రాలేదు కూడా. ఆ గుర్తింపుతోనే సినిమాల్లోనూ అడపాదడపా నటించాడు. కొన్నాళ్ల క్రితం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రంతో హీరోగా మారాడు. కానీ ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదు. వీక్ కంటెంట్ అని తేల్చారు ప్రేక్షకులు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని జబర్దస్త్ తొలినాళ్లలో దర్శకులుగా పేరు తెచ్చుకున్న నితిన్ - భరత్ ద్వయం డైరెక్షన్ లో వచ్చాడు. ఈ సారి పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ టైటిల్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’అనే టైటిల్ తో దిగాడు. టైటిల్ తో మంచి క్రేజ్ వచ్చింది. పాటలు బావున్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంది..? అంటే పూర్తిగా తేలిపోయింది అనే అంటున్నారు.

ఒకానొక మారుమూల ఊరిలో యేళ్ల తరబడి ఆడ పిల్ల పుట్టదు. ఊరంతా కరువుతో ఉంటుంది. ఆ టైమ్ లో పుట్టిన అమ్మాయే హీరోయిన్. ఆమెకు రాజకుమారి అనే పేరు పెట్టుకుంటారు. తనను ఆ ఊరు దాటకుండా ఉంచేందుకు ఆ 60మందిలో ఒకిరిని పెళ్లి చేసుకోవాలంటారు. అలాంటి ఊరికి ఇంజినీర్ గా వస్తాడు హీరో. మరి హీరో కాబట్టి హీరోయిన్ ప్రేమలో పడుతుంది. బట్ ఆ ప్రేమ గెలవాలంటే ముందు ఈ 60మందికి పెళ్లి కావాలంటారు. అందుకోసం హీరో తంటాలు పడుతుంటాడు. ఇదీ పాయింట్. పాయింట్ వరకూ బానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లో కన్ఫ్యూజన్ వల్ల జబర్దస్త్ లాంటి నవ్వులు కూడా పంచకుండా పోయింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంత వరకూ భరించినా సెకండ్ హాఫ్ పరమ బోరింగ్ గా ఉందంటున్నారు. అసలు ఓపెనింగ్స్ కూడా లేవీ చిత్రానికి.

ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అంత వర్కవుట్ కాలేదనే టాక్ ఉంది. మొత్తంగా ఇద్దరు యాంకర్స్ హీరో హీరోయిన్లుగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కమర్షియల్ గా వర్కవుట్ కావడం కష్టమే అని తేల్చేస్తున్నారు.

Tags:    

Similar News