'Where is Alia Bhatt': గణపతి విసర్జన్ లో కనిపించని అలియా భట్
ముంబైలో ఘనంగా గణపతి ఉత్సవాలు;
ముంబయిలో గణపతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం సెలబ్రెటీలతో వేడుకగా జరుగుతాయి. లాల్‌బౌగ్చా రాజా పండల్ సందర్శన నుండి ప్రైవేట్ పూజ వరకు, ఈ పండుగ ఉత్సాహంతో నిండి ఉంటుంది. సెప్టెంబర్ 23న రణబీర్ కపూర్, అతని తల్లి నీతూ కపూర్ గణపతి విసర్జన్ పూజ చేస్తుండగా అభిమానుల కంట పడ్డారు. ఈ సమయంలో ఆలియా భట్ పూజకు హాజరుకాకపోవడంతో అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది.
రణబీర్ కపూర్ ఈ టైంలో ఎరుపు రంగు టీ-షర్టు, జాగర్స్‌తో కనిపించగా.. నీతూ కపూర్ విసర్జనకు ముందు పూజ చేస్తున్నప్పుడు ఆకుపచ్చ సూట్‌ను ధరించి కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూల రేకులతో నిండిన ఓ చెరువులో సెలబ్రెటీలు గణపతి విగ్రహాన్ని ముంచడంతో ఈ వీడియో ముగుస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే, అభిమానులు అలియా భట్ గణపతి విసర్జన్ వేడుకను హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించారు. "అలియా ఉర్ఫ్ తలియా ఎక్కడ ఉంది" అని ఓ యూజర్ అడగగా.. "కపూర్లు అత్యంత శక్తివంతమైన గణపతి ఉత్సవాన్ని కలిగి ఉండేవారు... నాల్గవ తరం సంప్రదాయాన్ని కనీసం ముందుకు తీసుకువెళుతున్నట్లు చూడటం మంచిది" అని ఇంకొకరు రాసుకువచ్చారు.
ఇదిలా ఉండగా, రణబీర్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చిత్రం 'యానిమల్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అనిల్ కపూర్ , త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ మూవీ డిసెంబర్ 1న వెండితెరపైకి రానుంది.