Papam Prathap : ఈ సినిమాల్లో ఏది బెస్ట్ అవుతుంది..

Update: 2026-04-14 11:22 GMT

ఈ వారం 17న విడుదల కాబోతోన్న మూవీస్ కాస్త బెటర్ గా ఉండేలానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథల్లాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కథ బలం ఉన్న సినిమాల్లాగానే కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రాల్లో ఎక్కువ సత్తా చాటేవి ఏంటీ అంటే మాత్రం అప్పుడే చెప్పలేం. చాలా సినిమాలున్నా.. ప్రధానంగా ఈ నాలుగు మూవీస్ మాత్రం కాస్త ఎక్కువమందికి తెలిసినవి. పాపం ప్రతాప్, తిమ్మరాజు పల్లి, బ్యాడ్ బాయ్ కార్తీక్, తెరచాప. ఈ నాలుగు సినిమాలపై ఎక్కువ మందికి ఫోకస్ ఉంది అనేది నిజం.

పాపం ప్రతాప్ లో తిరువీర్ హీరోగా నటించాడు. అజయ్ ఘోష్, రాశి కీలక పాత్రలు చేశారు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. ఎస్పీ దుర్గా నరేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఈటీవి విన్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ బావుంది. ప్రమోషన్స్ చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. తిరువీర్ మసూద, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ మూవీస్ తో బాగా మెప్పించాడు. మరోసారి ఆ తరహాలో విజయవంతమైన చిత్రంతో వస్తున్నాడు అనిపించేలా ఉన్నాడు.

వి మునిరాజను డైరెక్ట్ చేసిన మూవీ తిమ్మరాజు పల్లి టివి. హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన మూవీ ఇది. అంతా కొత్తవాళ్లతో రూపొందించిన సినిమా. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా బావున్నాయి. కొత్త కంటెంట్ తో రాబోతోన్న మూవీలా ఉంది. చాలా వరకు మెప్పించే కథ, కథనాలతో వస్తుంది అని నిర్మాత కిరణ్ అబ్బవరం నమ్మకంగా చెబుతున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

చాలా గ్యాప్ తర్వాత నాగ శౌర్య నటించిన మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్. విధి యాదవ్ హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఈ మూవీలో కనిపించబోతోంది. రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చాలాకాలం పాటు చిత్రీకరణ చేసుకుంది. అంత ఎక్కువ టైమ్ ఎందుకు తీసుకుంది అనేది పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. నాగశౌర్య లుక్, యాటిట్యూడ్ బావుంది.

ఇక అంతా కొత్తవాళ్లే నటించిన మూవీ తెరచాప. ఈ మూవీ కూడా చాలాకాలం క్రితమే రెడీ అయింది. బాగా ఆలస్యంగా విడుదలవుతోంది. అయినా కంటెంట్ బావుంది అనే నమ్మకంతో ఉంది టీమ్. జోయొల్ జార్జ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కైలాష్ దుర్గం నిర్మించాడు. నవీన్ రాజ్, పైజా సుహాసిని, జగదీష్ ప్రతాప్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.

మొత్తంగా ఈ నాలుగు సినిమాలూ కంటెంట్ పరంగా నాలుగు రకాలుగా ఉండబోతున్నాయి అనిపించారు. మరి ఆడియన్స్ ఎక్కువ ఓటు వేసే మూవీ ఏంటీ అనేది తెలియాలంటే ఈ నెల 17న అర్థమైపోతుంది. 

Tags:    

Similar News