తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్నా.. కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. కంగువాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ పడుతుందనుకుంటే అదే రేంజ్ లో ఫ్లాప్ గా నిలించిందా సినిమా. దీంతో ప్రయోగాలు చేయకుండా ప్రస్తుతం రెట్రో అనే మాస్ కమర్షియల్ మూవీ చేశాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది రెట్రో.
రెట్రో తర్వాత మరో రెండు తమిళ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. అవి కాకుండా తెలుగులో ఫస్ట్ టైమ్ డైరెక్ట్ మూవీ చేయబోతున్నాడు. ఇలాంటి హీరోలను తీసుకురావడంలో ఎక్స్ పర్ట్ బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నాడు. వెంకీ ఆల్రెడీ పరాయి భాషా హీరోలైన ధనుష్ తో సార్, దుల్కర్ తో లక్కీ భాస్కర్ చిత్రాలను ఇదే బ్యానర్ లో డైరెక్ట్ చేశాడు.
ఇక సూర్య నటించే ఫస్ట్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఇద్దరు ముగ్గరు భామల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా క్రేజీ బ్యూటీ అనిపించుకున్న భాగ్య శ్రీ బోర్సేను తీసుకుంటున్నారు అన్నారు. మరి తను ఉందో లేదో కానీ తర్వాత డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్ పేరు వచ్చింది. తాజాగా టాలెంటెడ్ బ్యూటీ సంయుక్తను తీసుకున్నారు అంటున్నారు. మరి ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రం ఫైనల్ అవుతారు అనేది లేటెస్ట్ టాక్. మరి ఈ ముగ్గురి నుంచేనా లేక ఇంకెవరైనా కొత్త బ్యూటీస్ వీరిని రీ ప్లేస్ చేస్తారా అనేది చూడాలి.