Champion Movie : క్రిస్మస్ మూవీస్ లో హిట్ కొట్టేదెవరు..?

Update: 2025-12-22 08:04 GMT

ఈ సారి క్రిస్మస్ కు చాలా సినిమాలున్నాయి. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఎవరికి వారు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఆయా చిత్రాల మేకర్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. కంటెంట్ పరంగా ఆకట్టుకునే చిత్రాలివి అని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. ఆ కారణంగా అన్ని సినిమాలు విడుదలవుతున్నా.. ప్రేక్షకుల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఆయా చిత్రాల యాక్టర్స్, మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రాల్లో ఏ సినిమాకు సక్సెస్ పరంగా ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి అనేది చూద్దాం.

ఈ చిత్రాల్లో ముందుగా కనిపిస్తోన్న చిత్రం ఛాంపియన్. రోషన్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం చేశాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ సమర్పకుడుగా రూపొందించిన సినిమా. కంటెంట్ పరంగా చూస్తే ఇదో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని బైరాన్ పల్లి నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. 1947 తర్వాత కూడా తెలంగాణకు స్వాతంత్ర్యం రాకపోవడం.. నిజాం రాజు ఆకృత్యాల కారణంగా రజాకార్లు సాగించిన దాష్టీకాల నేపథ్యం కూడా ఉంది. మరి ఈ కథను అచ్చంగా కాకుండా ఫుట్ బాల్ ప్లేయర్ లా రోషన్ కనిపించాడు. మరి ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు రోషన్ అనిపించాడు. మరి అది నిజమా కాదా అనేది తర్వాత తెలుస్తుంది.

శంబాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు ఆది సాయికుమార్. ఈ మూవీ విషయంలో చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. సినిమా పూర్తయిన తర్వాత చాలాకాలంగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. నెల ముందే ట్రైలర్ విడుదల చేశాడు. రిలీజ్ కు ముందు రెండోది అంటూ మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. యుగంధర్ ముని దర్శకత్వం చేశాడు. ఫాంటసీ, హారర్ నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. మరి ఈ మూవీతో ఆది సాయికుమార్ అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలుస్తుంది.

శివాజీ, నవదీప్, బిందు బాధవి, నందు, రవి కృష్ణ, మౌనిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ దండోరా. ఈ మూవీ కూడా ఫస్ట్ నుంచి ఆసక్తిని కలిగిస్తున్నదే. నటీ నటుల పరంగా చాలా ప్లస్ గా కనిపిస్తోంది. కంటెంట్ పరంగా చనిపోయిన మనిషి కూడా కొంత జాగా కోసం సాగించే పోరాటంగా కనిపిస్తోంది. దాంతో పాటు కమర్షియల్ గా కూడా రూపొందింది. మురళీ కాంత్ దేవసోత్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ తో రాబోతోందీ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో కనిపిస్తోంది.

అంతా కొత్తవాళ్లతో రూపొందిన సినిమా పతంగ్. వంశీ పూజిత్, ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్ట్ చేసిన మూవీ. రిలీజ్ కు ముందుగా హడావిడీగా ట్రైలర్ తో వస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీపై కూడా అంచనాలున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోందీ మూవీ. మరి రిలీజ్ తర్వాత ఏమైనా సౌండ్ చేస్తుందేమో చూడాలి.

ఈషాగా వస్తోన్న మూవీ హారర్ కంటెంట్ తో ఉంది. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు కీలక పాత్రల్లో నటించారు. ఇది అవుట్ అండ్ అవుట్ హారర్ తోనే రూపొందిన సినిమా. ఈ మధ్య కాలంలోని హారర్ కామెడీతో కంటెంట్ తోనే కాకుండా కేవలం హారర్ నేపథ్యంలోనే కనిపిస్తోంది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ మూవీ మరి ఆ జానర్ ఆడియన్స్ తో మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

ఇక మళయాలంలో రూపొందిన చిత్రం వృషభ. మోహన్ లాల్ హీరోగా నటించిన మూవీ. ఇది డబ్బింగ్ మూవీగా వస్తోంది. మరి ఈ మూవీకి సంబంధించి పెద్దగా ప్రమోషన్స్ కనిపించలేదు. రెండు జన్మల నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. మరి ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

కన్నడలో మూవీ మార్క్. సుదీప్ హీరోగా నటించాడు. విజయ్ కార్తికేయ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. నవీన్ చంద్ర, యోగి బాబు, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. పెద్దగా ప్రమోట్ చేసిన ఈ మూవీ కూడా ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.

మొత్తంగా ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ క్రిస్మస్ కు తెలుగులో పెద్దగా హాలిడేస్ కూడా లేవు. మరి ఈ అన్ని మూవీస్ హిట్ అవుతాయోమో చూద్దాం.

Tags:    

Similar News