Ante Sundharaaniki : 'అంటే సుందరానికీ' అందుకే ఫ్లాప్ అయిందా..?
Ante Sundharaaniki : నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన అంటే సుందరానికి మూవీ పెద్దగా హిట్ కాలేదు.;
Ante Sundharaaniki : నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన అంటే సుందరానికి మూవీ పెద్దగా హిట్ కాలేదు. ఈ సినిమా పర్వాలేదు బాగానే ఉంది అని అనిపించినా కలెక్షన్లు రాబట్టడం, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో ఫెయిల్ అయింది. కథ కొత్తగా ఉన్నా సినిమా ఎందుకు హిట్ కాలేకపోయిందో రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన పరుచూరి పాఠాలు పేరుతో యూట్యూబ్ చానెల్‌ను నిర్వహిస్తున్నారు.. అందులో సినిమాల గురించిన ఉపన్యాసా ఇస్తూ ఉంటారు.
పరుచూరి మాటల్లో... అంటే సుందరానికి చిత్రంలో మతాంతర ప్రేమకథ స్టోరీలైన్ బాగుందన్నారు. కానీ స్క్రీన్‌ప్లే సరిగా లేకపోవడం, ఎక్కువ ట్విస్టులు ఉండడంతో ఫ్లాప్ అయిందన్నారు. ఎక్కువ ట్విస్టులతో ప్రేక్షకులకు చిరాకు వచ్చి థియేటర్లలో మూడు గంటలు కూర్చోలేరన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం అద్భుతంగా ఉందన్నారు. కేవలం కొన్ని సీన్లను మార్చుకొంటే సినిమా హిట్ అయ్యేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ.