బ్రో.. పాకిస్తాన్ లో ఎందుకు ట్రెండింగ్ లో ఉంది!!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం “BRO” ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.;

Update: 2023-09-01 05:43 GMT

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం “BRO” ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. గత వారం (ఆగస్టు 21 నుండి ఆగస్టు 27 వరకు) నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండటం ప్రస్తుతం గమనించదగిన విషయం. అయితే అతంకంటే ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో నెం.8 స్థానంలో నిలిచింది. మరి పవన్ కళ్యాణ్ సినిమాకు ఆయా దేశాల్లో ఎందుకు ఇంత ఆదరణ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మొదటగా చెప్పుకోవలసిన కారణం BRO చిత్రం హిందూ దేవుళ్ల ఇతివృత్తానికి చెందినది. ఈ సినిమా ఇండియాలో ఎందుకు ట్రెండ్ అవుతుందనే అభిప్రాయం ఆయా దేశాల ప్రజల్లో సహజంగానే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఆ దేశాల్లో వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది.

మరోవైపు, హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాలు ఇప్పుడు ఇతర దక్షిణాసియా దేశాలతో పాటు హిందీ మాట్లాడే ప్రేక్షకులు ఉన్న చోట కూడా చూస్తున్నారని తెలుగు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ ఈ చిన్న దేశాలకు కూడా విస్తరిస్తున్నదనేది వాస్తవం.

Tags:    

Similar News