Lata Mangeshkar Open On Marriage : లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఆమె ఆస్తుల విలువ ఎంత?

Lata Mangeshkar Open On Marriage : లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Update: 2022-02-06 12:16 GMT

Lata Mangeshkar Open On Marriage : లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని వేల పాటలతో సంగీత ప్రియులను మైమరిపించిన ఆమె జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం. సింగర్ గా శిఖరానికి ఎదిగిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఆమె చనిపోయేవరకు పెళ్లి చేసుకోలేదు.

పెళ్లి, పిల్లలు అనే విషయం పైన ఎప్పుడూ కూడా మాట్లాడిన లతా.. తన చివరి ఇంటర్వ్యూలో దీనిపైన స్పందించారు.. హృదయానికి మాత్రమే తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.. నేను దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను అంటూ సమాధానమిచ్చారు లతాజీ. అంతేకాకుండా జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలని అన్నారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు.

అయితే ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం ఉందని అంటారు. 1929 సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ .. ఆయనకీ ఐదుగురు పిల్లలు. అందులో లతాజీనే పెద్ద.. ఆమె చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం మొత్తం ఆమె పైనే పడింది. ఈ క్రమంలో మిగిలిన నలుగురిని సెటిల్ చేసే బాధ్యతను లతా తన భుజాలపైన వేసుకున్నారు.

వాళ్ళంతా సెట్ అయ్యే లోపు ఆమెకి పెళ్లి వయసు కూడా అయిపొయింది. ఇకపోతే లతా మంగేష్కర్‌కి 111 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19, న్యుమోనియా సమస్యలతో 28 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం 8:12 గంటలకు తుదిశ్వాస విడిచారు.



Tags:    

Similar News