Jana Gana Mana: 'జనగణమన'కు మహేష్ ఎందుకు నో చెప్పాడంటే ?

Jana Gana Mana: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు చాలా స్పెషల్.

Update: 2022-03-30 14:45 GMT

Janaganamana : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు చాలా స్పెషల్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పోకిరి, బిజినెస్‌మెన్ చిత్రాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌‌లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో అనుకుంటున్నారు.. కానీ వివిధ కారణాల వల్ల ఈ కాంబినేషన్‌‌లో మరో సినిమా కుదరలేదు.

కానీ మహేష్‌‌ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చాలా ఏళ్ల క్రితమే 'జనగణమన' అనే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు పూరీ.. మహేష్‌కు కూడా కథని వినిపించారు.. కానీ మహేష్ నుంచి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇదే స్క్రిప్ట్‌‌తో విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు పూరీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదల కానుంది.

ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా రిలీజ్ కానుందని పూరీ అనౌన్సు కూడా చేసేశాడు.. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుండగా మహేష్ ఈ స్టోరీకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. దేశభక్తి మరియు ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న 'జనగణమన' స్క్రిప్ట్.. రిస్క్‌‌తో కూడుకున్న సబ్జెక్ట్ అని మహేష్ భావించి ఇందులో నటించేందుకు ఆసక్తి చూపించలేదన్న చర్చ నడుస్తోంది.

Similar News