ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ మూవీస్ పై మంచి ఒపీనియన్ ఇండస్ట్రీలోనూ కలుగుతోంది. వైవిధ్యమైన నేపథ్యంలో కథలు కనిపించడం తెలుగులో అత్యంత అరుదు. అలాంటి అరుదైన మూవీగా దండోరా కనిపించబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. కథా పరంగా ఆకట్టుకునేలా ఉంది. స్టార్ కాస్ట్ కంటే కూడా స్టోరీకి తగ్గట్టుగానే పాత్రలు కనిపించడం మాత్రం రేర్. అలాంటి రేర్ గానే ఈ చిత్రం కనిపిస్తోంది. శివాజీ, నవదీప్, రవి కృష్ణ, నందు, బిందు బాధవి, మౌనిక వంటి ఆర్టిస్ట్ లు తమ పాత్రల పరిధిగా నటించే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి మూవీస్ కు సంబంధించి బలమైన నేపథ్యం బలంగా ఉండటం ప్లస్ పాయింట్ అవుతుంది.
దండోరా విషయంలోనూ కథా పరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనూ కనిపిస్తున్నా.. ఓ పాయింట్ చుట్టూనే ప్రధానంగా తిరుగుతూ ఉంటుంది అనిపించేలా ఉంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని అంత్య క్రియలకు కాసింత జాగా కూడా కరవవడం.. దాని చుట్టూ కులం, మతం కూడా కనిపించడం.. ఈ కథలో బలమైన నేపథ్యంగా కనిపిస్తోంది. అది కరెక్ట్ గా వర్కవుట్ అయితేనే కథగా సక్సెస్ అవుతుంది. లేదంటే పాత్రల వరకు మాత్రమే పరిమితం అవడం మాత్రం జరుగుతుంది. కాకపోతే ఇలాంటి కథల్లో కథనంగా మాత్రం ఒకే పాయింట్ చుట్టూ అల్లుకున్నట్టుగా ఉంటుంది. ఆ పాయింట్ కరెక్ట్ గా ఉండటమే ఇంపార్టెంట్. మరి ఈ మూవీకి సంబంధించి చూస్తే ఈ తరహా సినిమాలకు ఏ మేరకు ప్లస్ అవుతుంది అనేది చూడాలి.