Mark Movie : క్రిస్మస్ కు డబ్బింగ్ మూవీస్ నిలుస్తాయా..?

Update: 2025-12-22 12:32 GMT

స్ట్రెయిట్ మూవీస్ మధ్య డబ్బింగ్ సినిమాలేంటీ అనిపిస్తుంది... పండగ శెలవుల టైమ్ లో. ఈ యేడాది క్రిస్మస్ సందర్భంగా పెద్ద హాలిడేస్ లేకపోయినా లాస్ట్ ఫ్రైడే కాబట్టి ఈ నెల 25న స్ట్రెయిట్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఈ టైమ్ లో రెండు డబ్బింగ్ మూవీస్ కూడా విడుదల అవడం మాత్రం ఆశ్చర్యం. ఆ రెండు సినిమాలు ఒరిజినల్ టైమ్ లో బెటర్ గా ఉన్నా.. ఇప్పుడు మాత్రం తెలుగులో మైనస్ కాబోతున్నాయా అనిపిస్తోంది. ఆ రెండు డబ్బింగ్ మూవీస్ వృషభ, మార్క్ చిత్రాలు.

మోహన్ లాల్, సమర్ జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిన ద్వివేదీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన మూవీ వృషభ. నంద కిషోర్ దర్శకుడు. ఈ చిత్రం కోసం రెండేళ్లకు పైగా టైమ్ తీసుకున్నారు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ టైమ్ తీసుకున్నామని టీమ్ చెబుతోంది. మోహన్ లాల్ రెండు జన్మల కథగా కనిపిస్తోందీ మూవీ. సమర్ జిత్ లంకేష్ అనే కుర్రాడూ కీలకంగా కనిపించబోతున్నాడు. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేయడం మాత్రం మీడియాలో హైలెట్ చేస్తున్నారు. గీతా బ్యానర్ లో రిలీజ్ అంటే సినిమాలో దమ్మున్నట్టే అనే భావిస్తున్నారు కూడా. మరి ఈ మూవీ తెలుగులో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. బట్ ప్రమోషన్స్ పరంగా మాత్రం ఏమంత గొప్పగా కనిపించలేదు.

వృషభతో పాటు కన్నడ నుంచి మార్క్ అనే చిత్రం కూడా విడుదలవుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందింది. థ్రిల్లర్ గా కూడా కనిపిస్తోందని చెబుతున్నారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం చేసిన సినిమా మార్క్. ఈ మూవీపై తెలుగులో ఎలాంటి అంచనాలూ లేవు. బట్ కన్నడలో మాత్రం భారీ అంచనాలున్నాయి. నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, యోగి బాబు, గురు సోమసుందరం కీలక పాత్రల్లో కనిపించాడు. ట్రైలర్ మాత్రం రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైన్ లాగానే కనిపిస్తోంది.

మొత్తంగా ఈ రెండు డబ్బింగ్ మూవీస్ తెలుగులో ఏ మేరకు ప్రభావం చూపించబోతున్నాయి అనేది కీలకం. వీటితో పాటు డైరెక్ట్ గా తెలుగులో ఛాంపియన్, దండోరా, శంబాల, పతంగ్, ఈషా వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

Tags:    

Similar News