Mahesh Babu : మహేష్ బాబు శివారాధకుడుగా కనిపిస్తాడా..?

Update: 2025-08-09 09:00 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళితో చేస్తోన్న సినిమా నుంచి ఒక హాఫ్ లుక్ వదిలారు. నిజానికి మహేష్ బర్త్ డే టైమ్ లో ఏ సినిమా చేసినా ప్రతిసారీ ఏదో ఒక అప్డేట్ వచ్చేది. ఫస్ట్ టైమ్ ఏదీ లేకుండా ఆగిపోయింది. అందుకు కారణం రాజమౌళి. అతని సినిమా అంటే అంతా అతను చెప్పినట్టే జరుగుతుంది. జరిగి తీరాలి. పైగా ఇది ప్యాన్ వరల్డ్ మూవీ. అందుకే ఏ చిన్నఅప్డేట్ అయినా అంత ఈజీగా వదలడం లేదు. ప్రతిదాన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలో చూస్తాడు రాజమౌళి.అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినా.. ఏదో ఒక హైప్ క్రియేట్ అవ్వాలనుకుంటాడు. ఈ కారణంగానే మహేష్ బర్త్ డేకి ఏ లుక్కూ రిలీజ్ చేయలేదు. అయితే ఈ హాఫ్ లుక్ మాత్రం ఏదో అభిమానుల కోసం అయ్యుంటుంది అంతే.

ఇక ఈ లుక్ చూస్తే.. మహేష్ బాబు కాస్ట్యూమ్ కొత్తగా ఉంది. అంటే పాత కాలంలో వేసుకునేలాంటి డ్రెస్ లా ఉంది. మెడమీదుగా కారుతున్న రక్తం.. మెడలో రుద్రాక్ష మాల.. ఆ మాలకు ఢమరుకంతో కలిసి ఉన్న త్రిశూలం, నంది బొమ్మ. ఇవి చూస్తే.. సినిమా గురించి ముందు నుంచీ చెబుతున్నట్టుగా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచరస్ డ్రామా అనే మాటలో డౌట్స్ వస్తున్నాయి. ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాకు ఈ తరహా రుద్రాక్ష అనేది దేనికి సంకేతం.. అనేది అంతు చిక్కడం లేదు. అయితే కొందరు మాత్రం.. మన పురాతన సంపదను కొల్లగొట్టి ఆ అడవుల్లో దాస్తే.. దాన్ని తీసుకుని రావడానికి శివారాధన చేసే ఓ యువకుడు చేసే సాహసం అయ్యి ఉంటుంది అంటున్నారు. అదే నిజమైతే.. ఈ కథలో భక్తిని కూడా చూడొచ్చు. కేవలం భక్తి మాత్రమే కాకుండా.. దాంతో పాటు సాహసాలు, విన్యాసాలు, దైవబలం ఇవన్నీ కూడా యాడ్ అయినా ఆశ్చర్యం లేదు అనుకోవచ్చు. ఏదేమైనా ఈ హాఫ్ లుక్ లోని ఈ హింట్స్ సినిమాలో కీలకమే అయి ఉంటాయి అనుకోవచ్చు. 

Tags:    

Similar News