Mirai Movie : ఈ రెండు సినిమాలైనా టాలీవుడ్ కు జోష్ ఇస్తాయా..?

Update: 2025-09-08 09:36 GMT

కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగా డల్ గా ఉంటోంది. వస్తోన్న సినిమాలన్నీ ఢమాల్ అంటున్నాయి. అంచనాలు ఉన్న సినిమాలు సైతం ఆకట్టుకోవడం లేదు. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ మాగ్జిమం డిజప్పాయింట్ చేస్తున్నారు. ఈ వారం వచ్చిన ఘాటీ కూడా పోయింది. చాలా చిన్న సినిమా అనుకున్న లిటిల్ హార్ట్స్ మాత్రం అదరగొడుతోంది. ఇండస్ట్రీకి జోష్ రావాలంటే ఇది సరిపోదు. అందుకే వచ్చే వారం విడుదల కాబోతోన్న సినిమాలపైనే అంచనాలన్నీ ఉన్నాయి.

సెప్టెంబర్ 12న తేజ సజ్జా మిరాయ్, బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలపైనా అంచనాలున్నాయి. మిరాయ్ ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని రూపొందించాడు. కార్తీక్ ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు. అవేవీ కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు. కానీ బిగ్ స్పాన్ తో బిగ్ బడ్జెట్ తో రూపొందిన మిరాయ్ మాత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ను కొల్లగొడుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. మంచు మనోజ్ ఈ చిత్రంతో పూర్తి స్థాయి విలన్ గా ప్రూవ్ చేసుకోబోతున్నాడు. అతనికీ కీలకమే ఈ చిత్రం. ఇక శ్రీయ శరణ్ కొత్త పాత్రలో కనిపించబోతోంది. మిరాయ్ తో టాలీవుడ్ లో కొత్త ఊపు వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని తేజ సజ్జా నిలబెడితే అతనూ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నట్టవుతుంది.

ఇక రాక్షసుడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా కిష్కింధపురి. రాక్షసుడు మర్డర్ మిస్టరీ అయితే ఇది పూర్తిగా హారర్ జానర్ లో తెరకెక్కిన సినిమా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించాడు. పూర్తి స్థాయి హారర్ కంటెంట్ తో రూపొందిన ఈ మూవీ థియేటర్స్ లో ఆడియన్స్ ను వణికించడం గ్యారెంటీ అంటున్నారు. పైగా సినిమా నిడివి కూడా రెండు గంటలే. ఇది కూడా కొంత ప్లస్ అవుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే భయపెట్టడమే టార్గెట్ గా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు, నిర్మాత బలంగా చెబుతున్నారు. వీళ్లు నిజంగా భయపెడితే మాత్రం ఖచ్చితంగా కాసులు కురుస్తాయి. టాలీవుడ్ కూడా మెరుస్తుంది. మొత్తంగా మిరాయ్, కిష్కింధపురి చిత్రాలపై టాలీవుడ్ లో బోలెడు ఆశలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News