సందీప్ రాజ్ కలర్ ఫోటో తర్వాత చేసిన మూవీ మోగ్లీ. రోషన్ కనకాల హీరోగా నటించిన మూవీ. సాక్షి మధోల్కర్ హీరోయిన్. బండి సరోజ్ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. అయితే అదే డేట్ కు ఆగిపోయిన అఖండ 2 కూడా అనౌన్స్ అయింది. అంతే.. ఆ డేట్ కు మోగ్లీ పోస్ట్ పోన్ అవుతోంది అనిపిస్తోంది. మోగ్లీ పై భారీ అంచనాలతో ఉన్నాయి. దర్శకుడు, నిర్మాత అయిన టిజి విశ్వ ప్రసాద్ ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ చిత్రం గ్యారెంటీగా వాయిదా పడుతుంది అనే టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ కంటెంట్ పరంగా కొత్తగా కనిపిస్తోంది. ఈ కాలంలో హీరోయిన్ మూగ అమ్మాయిగా కనిపించడం అనేదే కొత్తగా ఉంది. మోగ్లీలో అదే కనిపిస్తోంది. పైగా ఆ అమ్మాయి ఓ సినిమాలో డ్యాన్సర్ గానూ కనిపించబోతోంది. అలాగే హీరో కూడా ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్ గా కనిపిస్తాడు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వీరి ప్రేమ మధ్యలో బండి సరోజ్ కుమార్ ఎంటర్ కావడంతో అసలు వీరి మధ్య ఏం జరగబోతుంది అనేది కాన్సెప్ట్ మాత్రం. కంటెంట్ పరంగానూ కొత్తగా ఉండేలా కనిపిస్తోంది. అలాంటి చిత్రాన్ని రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడం మాత్రం తప్పడం లేదు.
ఇక మోగ్లీ కొత్త రిలీజ్ డేట్ గా డిసెంబర్ 13న కావొచ్చు అనుకుంటున్నారు. మాగ్జిమం డిసెంబర్ 19 లేదా 24న విడుదల చేయొచ్చు అనిపిస్తోంది. అఖండ 2 బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు కొత్త డేట్ కు మారుతుంది. లేదంటే ఒక రోజు ఆలస్యంగా విడుదల కావొచ్చు.