కథల ఎంపికలో నాని రూట్ సెపరేట్. చాలామంది ఆశ్చర్యపోయే కథలతో మెప్పిస్తున్నాడు. కొన్నాళ్లుగా మాస్ ఆడియన్స్ టార్గెట్ గా మాస్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. శనివారాలు కోపం చేస్తున్నాడు. హిట్ కోసం బూతులూ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఏకంగా తన చేతిపై ‘లం..కొడుకు’ అనే ట్యాటూ కూడా వేయించుకుని ద ప్యారడైజ్ అంటూ మొదలుపెట్టాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ లుక్ చూస్తే నాని గెటప్ సినిమాలో ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. అతనికి రెండు జడలు వేశారు. ఆ కారణంగా అతన్ని జెడల్ అని పిలుస్తారని.. తన పాత్రను పరిచయం చేశాడు నాని. చుట్టూ ఎగిరే పావురాలు, బంధించేందుకు వాడే గొలుసులు, బ్లేడ్స్, ఆయుధాలు, గ్యాంబ్లింగ్ బోర్డ్ అంటూ చాలానే కనిపిస్తున్నాయి. వీటిని డీ కోడ్ చేస్తే చాలా విషయాలే అర్థమయ్యేలా ఉన్నాయి. అలా చేయడం అప్పుడే కాస్త తొందర అవుతుంది.
ఈ జూలై నుంచి ద ప్యారడైజ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నానితో పాటు రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు చేస్తున్నారు. రమ్యకృష్ణ ..నాని తల్లి పాత్రలో కనిపించబోతోంది. సినిమాను 2026 మార్చి 26న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. అయితే అదే డేట్ కు రామ్ చరణ్ పెద్ది కూడా అనౌన్స్ అయి ఉండటం విశేషం.
మొత్తంగా నాని జడల్ అనే పాత్రలో చాలా ఎక్కువ స్పాన్ తోనే కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. బ్లేడ్ దొంగ నుంచి పెద్ద గ్యాంబ్లర్ గా ఎదిగిన వ్యక్తి కథ అని ప్రాథమికంగా ఓ అంచనాకైతే రావొచ్చు. మరి ఈ జడల్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి.