గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీ మార్చి 27న విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు దర్శకుడు. ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేసిన ఆచార్య, గేమ్ ఛేంజర్ పోయాయి. ఈ రెండు సినిమాల తర్వాత అతను ఓ సూపర్ హిట్ కొడతాడు అని భావిస్తున్నారు. ఆ స్థాయిలో ఈ మూవీ కథ కూడా సెట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ మూవీ వీలైనంత త్వరగా చూడబోతున్నారు అభిమానులు. అయితే అది అంత ఈజీగా చూడటం కష్టమే అంటున్నారు.
ఈ మూవీ షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగుతోంది. అయితే చెప్పిన టైమ్ కు చిత్రీకరణ మాత్రం సాగడం లేదుట. అందుకు రకరకాల కారణాలు కూడా ఉంటున్నాయి. కొంత వరకు కీలకమైన సన్నివేశాల షూటింగ్ కోసం ప్లేస్ లు దొరకడం కష్టం అవుతోంది. ఆ స్థలాల్లో చిత్రీకరణ కోసం ముందుగా ఓకే అనుకున్న తర్వాత సెట్ కాకపోవడం ఓ కారణంగా కనిపిస్తోంది.
ఇక ఈ మూవీ నుంచి ఓ పాట కూడా విడుడదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో పాట కూడా ఆ స్థాయిలో ఉండాలని అనుకున్నారు. టైటిల్ సాంగ్ గా రాబోతోందట ఇది. జనవరి 1న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉంది టీమ్.
అయితే ఈ మూవీ షూటింగ్ కోసం ఆగుతున్నారట. అంటే రిలీజ్ డేట్ లో మార్పులు జరగబోతున్నారు అంటున్నారు. మార్చి నుంచి ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉందట టీమ్. ఈ కారణంగా ఈ సాంగ్ ముందుగా విడుదల చేయడం ఎందుకు అనుకుని ఉన్నారు.
నిజానికి ఈ మూవీ షూటింగ్ కోసం ఇంకా మూడు నెలల పాటు ఉంది. బట్ ఆ టైమ్ కు పూర్తి కావడం కష్టం అంటున్నారు. దీనికి తోడు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో కూడా టైమ్ పట్టేలా ఉందనే హింట్ కూడా ఉందట. ఆ కారణంగా ఈ మూవీ రిలీజ్ డేట్ మారబోతోంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే జనవరి 1న విడుదల చేయాల్సిన టైటిల్ సాంగ్ ను కూడా వాయిదా వేయాలని భావిస్తున్నారట. మరి అదేం నిజం కాదు.. ఈ మూవీ చెప్పిన టైమ్ కే విడుదల కావడం కన్ఫార్మ్ అయితే.. అప్పుడా టైమ్ కు పాట కూడా విడుదల చేయబోతున్నారు అంటున్నారు.