టీవీ షోలో నృత్య ప్రదర్శనతో కెరీర్ ప్రారంభించింది తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్. గత ఏడాది 'ఓం భీమ్ బుష్ 'తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆ సినిమా వైఫల్యంతో ఈ భామ వెలుగులోకి రాలేకపోయింది. అందం, అభినయం కల నాయిక అయినప్పటి కీ.. ఆ మూవీ వైఫల్యం ప్రీతిని వెనక్కి నెట్టేసింది. తాజాగా 'కన్నప్ప' మూవీతో వెలుగులోకి వచ్చింది. అందులో మెయిన్ లీడ్ పోషించింది. పాన్ ఇండియా సినిమా కావడంతో సక్సెస్ గ్యారంటీగా భావించింది. అందులో శక్తిమేర శ్రమించింది. కానీ 'కన్న ప్ప ' ఫలితం కూడా అమ్మడిని తీవ్ర నిరాశలో కి నెట్టేసింది. ప్రస్తుతం అమ్మడికి టాలీవుడ్ లో కొత్త అవకాశాలేవీ చేతిలో లేక బాగా వెనకబడింది. దీంతో ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మాలీవుడ్లో 'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటిస్తోంది. హృద్ హరున్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్ప టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 29న రిలీజ్ కానుంది. ఇక ఆ మూవీ విడుదలకు ముందే అమ్మడు మరో రెండు మాలీవుడ్ చాన్స్ లు దక్కించుకున్నట్లు సమాచారం. అదే విధంగా తమిళ్ లోనూ రెండు సినిమాలు సైన్ చేసినట్లు వా ర్తలొస్తున్నాయి. ఇక అక్కడైనా కలిసొస్తుందేమో చూడాలి.