మన శంకర వరప్రసాద్ గారు.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి అని భావిస్తున్నారు. కానీ నిజంగా భారీ అంచనాలున్నాయా అంటే ఇప్పటికి అయితే ఇంకా లేదు అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ. వెంకటేష్ ఓ కీలకమైన పాత్ర చేశాడు. రెండు పాటలు అయితే చాలా పెద్ద హిట్ అయ్యాయి. అంతే. ఇప్పటి వరకు ఈ మూవీ విషయంలో అంతకు మించి ఎక్కువగా వినిపించింది మాత్రమే అంతే. ఇప్పటి వరకు వచ్చిన వీడియో కంటెంట్స్ ఆకట్టుకున్నాయి. బట్ ఆ కంటెంట్స్ సినిమాపై అంచనాలు పెంచాయా అంటే లేదు అనే చెప్పాలి. అందుకే ఈ మూవీ ట్రైలర్ పై అందరి ఫోకస్ ఉంది. ట్రైలర్ తో మూవీపై ఒక అంచనాకు రావొచ్చు అనే భావనలో ఉన్నారు. అయితే ఆ ట్రైలర్ కూడా అటు చిరంజీవి స్టైల్ లో ఉంటుందా లేక అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ రెండూ మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కానీ ఇద్దరి స్టైల్ లో కూడా ఉండటం మాత్రం చాలా ఇంపార్టెంట్.
చిరంజీవి 2023లో చేసిన భోళా శంకర్ డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన విశ్వంభర ఇప్పటి వరకు అయిపులేదు. దీంతో మన శంకరవరప్రసాద్ పై ఒత్తిడి ఉండటం సహజం. అందుకే ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ను కూడా మెప్పించడం చాలా అవసరం. ఆ మాటకొస్తే.. మాస్ నే ఎక్కువ టార్గెట్ చేయడం అవసరం. మరి మాస్ ను ఎక్కువ ఆకట్టుకుంటూనే అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండటం కీలకం. మరి ఈ అంతా కనిపించడం అనేది ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. మరి ఆ ట్రైలర్ వస్తే కానీ ప్రేక్షకులు ఒక అంచనాకు రావొచ్చు.