పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య కొన్నాళ్లుగా విభేదాలున్నాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.ఇది ఎన్నికల టైమ్ లో పీక్స్ కు వెళ్లింది. అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి ఓటు వేయమని చెబుతూ ప్రచారం చేశాడు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ కూడా ఐకన్ స్టార్ ను దూరం పెట్టింది. సాయిదుర్గాతేజ్, రామ్ చరణ్ తో సహా అందరూ అతన్ని సోషల్ మీడియాలో ‘అన్ ఫాలో’చేశారు. ఇక ఎప్పటి నుంచో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా సినిమాల రిలీజ్ టైమ్ లో.
ఆ మధ్య అల్లు అర్జున్ పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ పరామర్శకు వెళదాం అనుకున్నారు. బట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. బట్ తెర వెనక చిరంజీవితో కలిసి అంతా నడిపించాడు. అతన్ని విడిపించాడు అనేది జగమెరిగిన సత్యం. నిజానికి వీరి మధ్య విభేదాలున్నాయంటారు. కానీ అవి విద్వేషాలు కాదు. అభిప్రాయ భేదాలు మాత్రమే. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురయ్యాడు కదా.. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్ తో పాటు మార్క్ శంకర్ ను పరామర్శించాడు. ఈ సందర్భంగా వారి మధ్య మునుపటి ఆప్యాయతలే కనిపించాయి.
సో మధ్యలో అభిమానులే అనవసరంగా రెచ్చిపోతున్నారు తప్ప.. నిజంగా ఆయా హీరోలు.. ముఖ్యంగా బంధువులైన వాళ్లు బానే ఉంటారు. ఒకసారి కాకపోతే మరోసారి కలిసిపోతారు. ఈ ఎడబాట్లు శాశ్వతం కాదు. కానీ కలయికలు మాత్రం శాశ్వతం. అందుకే ఏ హీరో అభిమానులైనా కాస్త సంయమనంతో ఉండాలి. ఉంటేనే వారు కూడా బావుంటారు.