సౌత్ లో మోస్ట్ అండ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ అంటే ఉపేంద్ర అనే చెప్పాలి. దర్శకుడుగా కన్నడ ఇండస్ట్రీకి అతనో వరం అంటారు. తెలుగులో శివలాగా కన్నడలో ఆయన రూపొందించిన ఓమ్ ను చెబుతారు. ఇదో పాథ్ బ్రేకింగ్ మూవీ అక్కడ. అంతకు ముందే ‘ష్’ అనే మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఏ, ఉపేంద్ర సినిమాలైతే ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత దర్శకుడుగా ఆ రేంజ్ మూవీస్ తీయలేదు అనేది నిజం. అయినా అతను ఏం చేసినా అందర్లా చేయడు. కొత్తగా ఆలోచిస్తాడు. కొత్తగానే మేకింగ్ ఉంటుంది. డైలాగ్స్, టేకింగ్ అన్నీ అవుట్ ఆఫ్ ద సిలబస్ అన్నట్టుగా ఉంటుంది. ఇది టైటిల్ నుంచే మొదలవుతుంది. అలా మొదలైంది కాబట్టే ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘యూఐ’ కోసం చూస్తున్నారు.
ఓ కొత్త సెటప్ లో ఈ చిత్రాన్ని రూపొందించాడు ఉపేంద్ర అని టీజర్ కే తెలిసిపోయింది. ప్రస్తుతం ఏ భాషలో చూసినా పీరియాడిక్ కథలు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఉపేంద్ర ‘ఫ్యూచరిక్’ స్టోరీతో వస్తున్నాడు. 20240ల కాలంలో ఈ యూ ఐ కథ చెప్పబోతున్నాడని అర్థం అవుతోంది. అది కూడా సొసైటీ మీద సెటైరికల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రమోషన్స్ లో ఎక్కడా తన కథ గురించి రివీల్ చేయడం లేదు. కానీ ఏదో ఉందనే ఆసక్తి ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు. అందుకే యూఐపై ఇంత హైప్ ఉంది. ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత భారీ హిట్ కొట్టబోతున్నాడు అనే కలర్ కనిపిస్తోందీ మూవీలో. ఒకవేళ హిట్ కాకపోయినా.. దర్శకుడుగా, రచయితగా అతని రేంజ్ కు ఏ మాత్రం తగ్గదు అనే గ్యారెంటీ ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది. అందుకే ఈ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీగా మారింది.