Yash : నా ఛాయిస్ ఆమెనే.. అవకాశం వస్తే తనతో.. : యశ్

Yash: అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఓ అభిమాని తన పెళ్లి ఆహ్వాన పత్రికలో కేజీఎఫ్ లోని డైలాగ్‌ కొట్టించాడు.

Update: 2022-04-21 11:30 GMT

Yash: కన్నడ స్టార్ యశ్ క్రేజ్ ఇప్పుడు 'కేజీఎఫ్' తో బాగా పెరిగిపోయింది.. సినీ ప్రేమికులు అతడి పేరుని పలవరిస్తున్నారు. కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల్లో అతడి పేరు వినిపిస్తోంది.. అతడికి మహిళా అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఇప్పుడు అతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. కన్నడ సినీ నటుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఓ అభిమాని తన పెళ్లి ఆహ్వాన పత్రికలో కేజీఎఫ్ లోని డైలాగ్‌ కొట్టించాడు. అలాంటి హీరోతో ఏ రోజైనా సినిమా చేయాలని హిందీ నిర్మాతలు-దర్శకులు ఆలోచిస్తున్నారు.


ఉదాహరణకు 'బాహుబలి' తర్వాత బాలీవుడ్ దర్శకులు ప్రభాస్‌తో పనిచేయడానికి ఆసక్తి చూపడం వంటిదే. రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఈ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో పాటు యష్ కూడా ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ యశ్ నిజంగానే హిందీ సినిమాలో పని చేస్తే ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటాడు అని అందరిలో ఆసక్తి.. అదే విషయాన్ని అతడిని అడిగితే దీపికా పదుకొణెతో చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.. ఆమె నటన బాగుంటుంది. ఆమె పని చేసిన సినిమాలన్నీ చూశాను.. అవకాశం వస్తే ఆమెతో కలిసి పనిచేస్తాను అని అన్నాడు యశ్.

దీపికతోనే ఎందుకు పని చేయాలనుకుంటున్నాడంటే ఆమె కూడా బెంగళూరుకు చెందిన వ్యక్తి కావడం. కాబట్టి కంఫర్ట్ జోన్ మెరుగ్గా ఉండవచ్చు. దక్షిణాదికి చెందిన చాలా మంది హీరోలు హిందీలో అంతగా లేరు. యష్ దీపిక పేరు అందుకే ప్రస్తావించి ఉండవచ్చు.

దీపిక ఇప్పటికే దక్షిణాది హీరోల హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమాలో దీపిక నటిస్తోంది. మరో దక్షిణాది హీరో దీపికతో కలిసి హిందీలో నటించాలనుకుంటున్నాడు. దక్షిణాది హీరోల ఫస్ట్ ఛాయిస్ దీపిక అవుతోంది. అయితే వీరి కోరికలను బాలీవుడ్ దర్శక, నిర్మాత ఎవరైనా తీరుస్తారో లేదో చూడాలి. 

Tags:    

Similar News