Yashoda Twitter Review: యశోద.. నటించింది 'సమంత' అక్కడ.. ట్విట్టర్ రివ్యూ
Yashoda Twitter Review: ఏదైనా పని చేస్తే దానికో లెక్కుండాలి. సమంత నటిస్తే ప్రేక్షకులు ఆ సినిమా కచ్చితంగా చూడాల్సిందే అనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు.;
Yashoda Twitter Review: ఏదైనా పని చేస్తే దానికో లెక్కుండాలి. సమంత నటిస్తే ప్రేక్షకులు ఆ సినిమా కచ్చితంగా చూడాల్సిందే అనుకునే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. నటన అంటే ప్రాణం పెట్టే సమంత కథలను ఆచి తూచి ఎంచుకుంటుంది. అందుకు అన్ని ఎఫర్ట్స్ పెడుతుంది. అద్భుతంగా నటిస్తుంది. అది ఇప్పటికే ప్రూవ్ అయింది.
ఇప్పుడు వచ్చిన యశోద కూడా సమంతకు మంచి పేరు తీసుకువస్తుంది. ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. నటన అంటే నాలుగు పాటలు, నాలుగు ఎక్స్‌పోజింగ్ సీన్స్ కాదు.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడు సంతృప్తిగా ఉండాలని చెబుతాయి, ఆలోచింపజేస్తాయి సమంత చిత్రాలు. అందుకే యశోద చిత్రాన్ని చూడడానికి థియేటర్లవైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్షకులు.
సమంత రూత్ ప్రభు నటించిన 'యశోద' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత సరోగసీ మదర్‌గా నటించింది. ఇది సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తగా, అనూహ్య స్పందన వస్తోంది.
ఆకర్షణీయమైన కథనం, నటీనటుల నటనతో పాటు, అద్భుతమైన కథనంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది యశోద. సమంత అద్భుతంగా నటించిందని నెటిజన్లు అంటున్నారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. మణిశర్మ సంగీతం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
థియేటర్‌లకు చేరుకున్న అభిమానులు ఇప్పటికే ట్విట్టర్‌లో రివ్యూలను పంచుకోవడం ప్రారంభించారు. ఊహించినట్లుగానే, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి ఓపెనింగ్స్‌తో అద్భుతమైన స్పందనను అందుకుంటుంది. 'యశోద.'పై సానుకూల స్పందనలను వెలిబుచ్చుతున్నారు నెటిజన్లు.
#Yashoda Review:
— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022
Decent Engaging Emotional Thriller 👌#SamanthaRuthPrabhu is the lifeline of the film 👍
Other Cast were apt & good 👌
BGM is Superb 💯
Visuals & Action Scenes are good 👍
Concept 👏
Rating: ⭐⭐⭐/5#YashodaTheMovie #YashodaReview #Samantha pic.twitter.com/YZfACi5gua
#Yashoda is an engaging thriller ! 👍#Samantha acts with great conviction.
— Santosh R. Goteti (@GotetiSantosh) November 11, 2022
Intriguing plot with twits and turns.
Go for it!
3.5/5#YashodaReview pic.twitter.com/wMc1Q03Xtc