బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. తన తర్వాతి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ అంటూ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాని లేదా నితిన్ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్‌డేట్ వచ్చింది. ఓ మూవీ ఈవెంట్‌లో బలగం వేణుని నిర్మాత దిల్ రాజు అడుగుతూ.. ఎల్లమ్మ ఎప్పుడు ఉంటుందని అడగగా.. దీనికి వేణు సమాధానమిస్తూ.. 'సార్ అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు ఇప్పుడు మొదలుపెట్టమన్నా స్టార్ట్ చేస్తాను. నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దామా అని అడుగగా.. వద్దు సామీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాం' అంటూ దిల్ రాజు అన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరిలో అధికారికంగా లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.