Bhuvneshwar Kumar : టీంఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట విషాదం..!
Bhuvneshwar Kumar : టీమిండియా క్రికెటర్ల కుటుంబాల్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ ఇళ్ళల్లో కరోనా విషాదం నింపింది.;
Bhuvneshwar Kumar : టీమిండియా క్రికెటర్ల కుటుంబాల్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ ఇళ్ళల్లో కరోనా విషాదం నింపగా.. తాజాగా టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.. ఆయన తండ్రి కిరణ్ పాల్ సింగ్ క్యాన్సర్ తో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. మీరట్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఆయన కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యారు.. అతి ఆరుదైన లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, జాండీస్ తో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తుది శ్వాస విడిచారు. గతంలో ఆయన నోయిడా మరియు ఢిల్లీలో మెరుగైన కీమోథెరపీ చికిత్స కూడా చేయించుకున్నారు.