India vs South Africa 1st Test : విజయానికి ఆరు వికెట్లు... ఫస్ట్ టెస్టు పై పట్టుబిగించిన ఇండియా..!

India vs South Africa 1st Test : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది.

Update: 2021-12-30 01:50 GMT

India vs South Africa 1st Test  : సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సౌతాఫ్రికా విజయానికి మరో 211 పరుగులు అవసరమవగా..టీమిండియాకు 6 వికెట్ల అవసరముంది. అంతకుముందు నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్...రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే ఆలౌటైంది. పంత్‌ 34, రాహుల్ 23 పరుగులతో రాణించారు. తర్వాత 305 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు వరుస బ్రేకుల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ ఎల్గర్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, షమీ, సిరాజ్‌ తలో వికెట్ తీశారు. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆట చివరి రోజు భారీ వర్ష సూచన ఉంది. ఒకవేళ వాన రాకపోతే భారత్‌ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండగా...వరుణుడు కరుణించకపోతే 'డ్రా'తో సరిపెట్టుకోవాల్సిందే..! 

Tags:    

Similar News