India vs Scotland : ఇది మాకు సవాలే.. అయినా టీంఇండియాను ఓడిస్తాం..!
India vs Scotland : టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు టీంఇండియాతో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టును తప్పకుండా ఓడిస్తామాని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ ధీమా వ్యక్తం చేశాడు.;
India vs Scotland : టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా నేడు టీంఇండియాతో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టును తప్పకుండా ఓడిస్తామాని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఇది ఒక కఠినమైన సవాలు అని మాకు తెలుసని.. అయితే మనపై మనకు నమ్మకం ఎప్పుడూ పోకూడదని కైల్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ పైన ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్ళ నుంచి తాము చాలా నేర్చుకోవాలని అన్నాడు.
విరాట్ తమ ఆటగాళ్ళతో మాట్లాడి వారిలో దైర్యాన్ని నింపాలని కోరాడు. టాస్ సమయంలో విరాట్ కోహ్లి పక్కన నిలబడడం నాకే కాదు ఎవరికైనా ప్రత్యేక సందర్భం. దానిని తను ఓ అదృష్టంగా భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్‌కి ఆహ్వానిస్తానని అన్నాడు.. కాగా సెమీస్ రేసు అవకాశాలను భారత్ సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో భారీ రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. అటు మరోపక్కా న్యూజిలాండ్ తో నమీబియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకి పెద్దగా కీలకం కాకపోయినప్పటికీ భారత్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది. ఈ మ్యాచ్ లో నమీబియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే భారత్ సెమిస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మధ్యాహ్నం మూడు గంటలకి షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.