Ravindra Jadeja : 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా..!
Ravindra Jadeja : మొహాలీలో శ్రీలంక జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
Ravindra Jadeja : మొహాలీలో శ్రీలంక జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.. విజయంలో కీ రోల్ ప్లే చేసిన రవీంద్ర జడేజాకి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో జడేజా మొదటి ఇన్నింగ్స్ లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక బౌలింగ్ లో మొదటి ఇనింగ్స్ లో అయిదు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకని మట్టికరిపించాడు.
60 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడు టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1962లో వెస్టిండీస్ పై పాలీ ఉమిగ్రర్ ఈ ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయంగా క్రికెట్‌లో ఈ రికార్డు నెలకొల్పిన ఆరో ఆటగాడిగా జడేజా నిలిచాడు. కాగా టెస్టు క్రికెట్‌లో ఏడో నెంబర్ బ్యాట్స్ మెన్ గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును కూడా జడేజా బద్దలు కొట్టాడు.
టెస్టు క్రికెట్‌లో జడేజాకి ఇది రెండో సెంచరీ కాగా అయిదేసి వికెట్లు తీయడం పదోసారి.. సొంతగడ్డపై 8వ సారి కావడం విశేషం. బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశాడు జడేజా. కాగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మార్చి 12 నుంచి రెండో టెస్ట్ మొదలవుతుంది.