Ravindra Jadeja : కపిల్ దేవ్ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన జడేజా...!
Ravindra Jadeja : ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత అల్‌రౌండర్ రవీంద్ర జడేజా ((175 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు.;
Ravindra Jadeja : ఇండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత అల్‌రౌండర్ రవీంద్ర జడేజా ((175 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. ఇండియా తరుపున ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన జడేజా.. టెస్టుల్లో అత్యధిక స్కోర్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
అయితే అంతకుముందు ఈ రికార్డు మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (163) పేరు మీద ఉంది. కపిల్ 35 ఏళ్ల పాటు ఈ రికార్డును నెలకొల్పాడు. 1986 డిసెంబర్‌లో కాన్పూర్‌లో శ్రీలంకపై 7వ స్థానంలో బ్యాటింగ్ చేసిన కపిల్ 163 పరుగులు చేశాడు. అయితే జడేజా ఆ స్కోర్‌ని శ్రీలంక జట్టు పైన అధిగమించడం విశేషం.
ఏడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి 150 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసిన మూడో భారతీయుడిగా కూడా జడేజా రికార్డు నెలకొల్పాడు. అంతుకుముందు కపిల్ దేవ్, రిషబ్ పంత్ ఈ ఘనత సాధించారు.
ఇక జడేజా 175 పరుగులతో షమీ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీనితో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది.