IND vs ENG 2nd Test: శుభ్‌మన్ గిల్ విధ్వంసం..భారత్‌కు భారీ ఆధిక్యం
టెస్టుల్లో మూడో శతకం బాదిన గిల్ల్;
ఉప్పల్ టెస్టులో విఫలైమన గిల్.. వైజాగ్ మ్యాచ్‌లో మునపటి గిల్‌ను తలపించాడు. 35 పరుగులకే 2 వికెట్లు పడిన దశలో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న గిల్ ఏ ఒక్క చెత్త షాట్ ఆడలేదు. రెండుసార్లు ఎల్బీ అప్పీల్ తప్పించుకున్న అతడు మూడో వికెట్‌కు శ్రేయస్ అయ్యర్(29)తో 81 పరుగులు జోడించాడు.
అయితే.. ఆ తర్వాతి ఓవర్లోనే టామ్ హర్ట్లే బౌలింగ్‌లో అయ్యర్ భారీ షాట్ ఆడగా.. బెన్ స్టోక్స్ పరుగెత్తుతూ వెళ్లి డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, ఇండియా 111 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (9) కుదురుకున్నట్టే కనిపించినా.. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్, గిల్ ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు.
గతేడాది వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్ అనంతరం టెస్టుల్లో గిల్ పరుగులు చేయలేక విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్ మినహాయిస్తే 12 ఇన్నింగ్స్‌ల్లో 207 పరుగులే చేశాడు. 18 సగటుతో బ్యాటింగ్ చేయడంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని వాదనలు వినిపించాయి. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్‌కు చేర్చడంతో 30 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది.