Under 19 World Cup: సెమీస్‌లో అదరగొట్టిన కుర్రాళ్లు... ఫైనల్‌కు టీమిండియా

Under 19 World Cup: ఆస్ట్రేలియాతో జరిగిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు.

Update: 2022-02-03 01:30 GMT

Under 19 World Cup: ఆస్ట్రేలియాతో జరిగిన అండర్‌-19 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు దూసుకెళ్లారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆస్ట్రేలియా ముందు 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐతే లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా194 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌ 96 పరుగుల తేడాతో విజయం సాధించి పైనల్‌లో అడుగు పెట్టింది. భారత బౌలర్లలో విక్కి మూడు వికెట్లతో రాణించగా....నిషాంత్‌, రవి కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో లక్లాన్‌ షా ఒక్కడే హాఫ్‌ సెంచరీతో పర్వా లేదనిపించాడు. ఇక శనివారం జరగనున్న టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌తో తలపడునుంది టీమిండియా.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆట ప్రారంభంలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 16 రన్స్ దగ్గర రఘువంశీ ఫస్ట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తర్వాత హర్నూర్‌ సింగ్ కూడా వెంటనే అవుటయ్యాడు. దీంతో 37 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి ఇండియా కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన షేక్‌ రషీద్,యష్‌దుల్‌ జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇదే క్రమంలో కెప్టెన్‌ యష్‌దుల్‌ సెంచరీ పూర్తి చేసుకోగా...గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌ 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. జట్టు స్కోరు 241 పరుగుల దగ్గర వీరిద్దరూ పెవిలియన్ చేరారు.

ఇక చివరి ఓవర్‌లో దినేష్‌ బానా, నిషాంత్ సింధు ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. పది బాల్స్ ఆడిన నిషాంత్ సందు ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 12 పరుగులు చేయగా..నాలుగు బాల్స్ ఆడిన దినేష్ బానా రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 20 రన్స్ చేశాడు. సెంచరీతో రాణించిన యష్‌దుల్‌కు ప్లేయర్ ఆఫ్‌ ది అవార్డు దక్కింది. ఇక వరుసగా నాలుగో సారి అండర్‌-19 వరల్డ్‌ కప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా...మొత్తంగా 8 సార్లు ఫైనల్‌కు చేరింది.


Tags:    

Similar News