Virat Kohli : ఇప్పటివరకు ఈ ఇద్దరికే అది సాధ్యమైంది..!

Virat Kohli : మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యా్చ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2022-03-05 10:48 GMT

Virat Kohli : మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యా్చ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు... టెస్టుల్లో 8000 టెస్టు పరుగులు చేసిన ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు.. అయితే కోహ్లీ ఈ మైలురాయిని తన 100వ టెస్టు మ్యాచ్‌‌లో సాధించడం మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఈ ఘనత సాధించిన 32వ క్రికెటర్ కోహ్లీ కావడం విశేషం.

కోహ్లీ కంటే ముందు ఇండియన్ క్రికెటర్ లలో సచిన్ టెండూల్కర్ (154 ఇన్నింగ్స్), రాహుల్ ద్రవిడ్ (157), వీరేంద్ర సెహ్వాగ్ (160), సునీల్ గవాస్కర్ (166) ఉన్నారు.. వీరి తర్వాత ఈ ఫీట్ సాధించిన నాల్గవ భారత ఆటగాడు కోహ్లి (169 ఇన్నింగ్స్).. ఇక రికీ పాంటింగ్ తర్వాత 100వ టెస్టులో 8000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 2006లో దక్షిణాఫ్రికాపై సిడ్నీలో జరిగిన 100వ టెస్టులో పాంటింగ్ ఈ మైలురాయిని సాధించగా, 2022లో కోహ్లీ ఆ మైలురాయిని అందుకున్నాడు.

అటు AB డివిలియర్స్ తర్వాత టెస్టులు మరియు వన్డేలు.. ఈ రెండింటిలోనూ 8000 ప్లస్ పరుగులు మరియు 50 ప్లస్ సగటును కలిగి ఉన్న రెండవ ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ సాధించిన ఇంకో ఘనత ఏంటంటే సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మల తర్వాత భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్ కోహ్లీ కావడం మరో విశేషం. 

Tags:    

Similar News