Asha Kiran Shelter : 20 రోజుల్లో 13 మంది పిల్లలు మృతి

Update: 2024-08-03 06:45 GMT

ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆశాకిరణ్ వసతి గృహంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లోనే 13 మంది దివ్యాంగ పిల్లలు చనిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి 27 మంది మరణించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి అతిశీ స్పందించారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన షాకింగ్‌గా ఉంది. ఇది తీవ్రమైన సమస్య. ఈ అంశంపై విచారణ చేపట్టి 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి’ అని అధికారులను ఆదేశించారు.కాగా, ఆశాకిరణ్ షెల్టర్‌ హోమ్‌ నిర్వహణలో నిర్లక్ష్యం, దారుణ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దీనిపై స్పందించింది. నిజనిర్ధారణ బృందాన్ని ఆ షెల్టర్ హోమ్‌కు పంపింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయిందని విమర్శించారు. పిల్లలు బాధలు పడుతున్నారని, చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ఆరోపించారు. మిస్టరీ మరణాలపై విచారణ కోసం ఒక బృందాన్ని అక్కడకు పంపినట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తుందని చెప్పారు.

Tags:    

Similar News