Hyderabad: ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంట్లో ఉన్న 13 ఏళ్ల బాలిక అదృశ్యం
Hyderabad: ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలు. ఒక్కోసారి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.;
Hyderabad: హైదరాబాద్ కవాడిగూడలో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో ఇంట్లోనే ఉంటోంది బాలిక. అయితే... నిన్న మధ్యాహ్నం కూతురు ఫోన్ అటెండ్ చేయకపోవడంతో తండ్రి ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలు. ఒక్కోసారి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. నిన్న సాయంత్రం 7, 8 గంటల మధ్య బాలిక ఫోన్ సిగ్నల్.... నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించింది. దీంతో స్నేహపురి కాలనీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.