Uttar Pradesh : జాబ్‌లో చేరిన తొలిరోజే శవమై... నర్సుపై సామూహిక అత్యాచారం?
Uttar Pradesh : ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ నర్సు(18) శవమై కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది.;
Uttar Pradesh : ఉద్యోగంలో చేరిన తొలిరోజే ఓ నర్సు(18) శవమై కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. అయితే ఆమె పై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టంలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాలేదని చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాంగర్‌మవూ ప్రాంతంలోని న్యూ జీవన్ ఆస్పత్రి ఐదు రోజుల క్రితమే ప్రారంభించబడింది.
అయితే అందులో ఉద్యోగిగా చేరిన నర్సు మొదటి రోజే గోడకు వేలాడుతూ కనిపించడం అందరిని షాక్ కి గురిచేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా ఉన్నావ్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలపై కొన్ని దారుణమైన నేరాలు జరుగుతున్నాయి.