కుళాయి నీటి కోసం గొడవ.. మేనల్లుడిని చంపిన కేంద్ర మంత్రి సోదరుడు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు గురువారం ఉదయం కాల్చి చంపబడ్డాడు.;
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు గురువారం ఉదయం కాల్చి చంపబడ్డాడు. భాగల్పూర్ లోని నవ్‌గాచియాలోని జగత్‌పూర్ గ్రామంలోని వారి నివాసంలో కుళాయి నీటి విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో వారి తల్లికి కూడా తుపాకీ గాయాలు అయ్యాయి.
"ప్రాథమికంగా చూస్తే, ఇద్దరు సోదరుల మధ్య నీటి కుళాయి విషయంలో వివాదం తలెత్తిందని, అది తీవ్రమై ఒకరిపై ఒకరు కాల్పులకు దారితీసిందని తెలుస్తోంది. మృతుడిని విశ్వజిత్ యాదవ్‌గా గుర్తించగా, గాయపడిన వ్యక్తి జయజిత్, అతన్ని అధునాతన చికిత్స కోసం తరలించారు. సంఘటన స్థలం నుండి ఒక షెల్ కేసింగ్ మరియు లైవ్ కార్ట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాము" అని నవ్‌గచియా పోలీసు సూపరింటెండెంట్ ప్రేరణ కుమారి తెలిపారు.
గురువారం తెల్లవారుజామున విశ్వజిత్, జయజిత్ భార్యల మధ్య కుళాయి నుండి నీరు నింపడంపై వాగ్వాదం చెలరేగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జయజిత్ నీరు తోడుతుండగా, ఆ కుళాయి తనదేనని విశ్వజిత్ గొడవకు దిగారు. ఇది శారీరక ఘర్షణకు దారితీసింది, ఆ సమయంలో విశ్వజిత్ జయజిత్‌పై కాల్పులు జరిపాడని, విశ్వజిత్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. వారి గొడవను తగ్గించడానికి తోబుట్టువుల మధ్యకు వచ్చిన వారి తల్లి హీనా దేవి కూడా గాయపడ్డారు. ముగ్గురినీ భాగల్పూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తరలించారు, కానీ విశ్వజిత్ మార్గ మద్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. "జయజిత్ పరిస్థితి విషమంగా ఉంది. అధునాతన చికిత్స అందిస్తున్నారు అని ఒక అధికారి తెలిపారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన దాని ప్రకారం, సోదరులు ఇద్దరూ ఒకే ఇంట్లో నివసించినప్పటికీ, ఎప్పుడూ గొడవలు పడుతుంటారని తెలిపారు.