Kakinada: కాకినాడ జిల్లాలో యువతి మిస్సింగ్.. అయిదు రోజులుగా..
Kakinada: నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజులుగా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.;
Kakinada: కాకినాడ జిల్లాలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపుతుంది. నీలపల్లికి చెందిన యువతి ఐదు రోజులుగా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. సూసైడ్ నోట్, వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వల్ల తాను మనోవేదనకు గురవుతున్నానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలని పేర్కొంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో యువతి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆచూకి లభించకపోవడంతో వెనుతిరిగారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే యువతిని చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఓ యువకుడు.. యువతి ఫోటోలు తగలబెడుతూ చనిపోకపోతే తానే చంపుతానంటూ బెదిరించినట్లు తెలుస్తోంది.