AP Crime: సోషల్ మీడియాలో పరిచయం.. ఫస్ట్ మీటింగ్‌లో ఊహించని మలుపు..

AP Crime: సోషల్‌ మీడియాలో పరిచయం హత్యాయత్నానికి దారితీసింది.;

Update: 2021-10-27 06:11 GMT

Ap Crime news (tv5news.in)

AP Crime: సోషల్‌ మీడియాలో పరిచయం హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కంకిపాడుకు చెందిన ఓ యువతికి యార్లగడ్డ డేవిడ్‌ అనే యువకుడితో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. చాలారోజుల నుండి వీరు చాటింగ్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు.

చివరిగా ఒకరోజు కలవడానికి ఆ యువతి మైలవరం మండలం పుల్లూరు రావాల్సిందిగా డేవిడ్‌‌కు సమాచారం పంపింది. అక్కడ వారు కలవడం గురించి తెలుసుకున్న యువతి సోదరుడు వారికి తెలియకుండా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు డేవిడ్‌పై యువతి సోదరుడు దాడికి తెగబడ్డాడు. గొంతు కోయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్‌ది భవానీపురం హౌసింగ్‌ బోర్డు కాలనీ అని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News