Tamil Nadu Crime : 'వరుడు కావలెను'.. భార్య ఫోటోలు మ్యాట్రిమొనిలో .. !
Tamil Nadu Crime : వారిద్దరూ భార్యాభర్తలు.. చేసేదేమో సాఫ్ట్‌వేర్ జాబ్.. వారికి అయిదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు.. ఎందుకో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.;
Tamil Nadu Crime : వారిద్దరూ భార్యాభర్తలు.. చేసేదేమో సాఫ్ట్‌వేర్ జాబ్.. వారికి అయిదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు.. ఎందుకో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీనితో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆ భర్త వక్రబుద్ధి చూపించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ళ కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారు.
ఈ క్రమంలో రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని భార్య వివరాలను ఉంచాడు. దీనితో యువతి తండ్రికి ఫోన్‌కాల్స్ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలిసుల విచారణ చేపట్టగా ఓంకుమార్ ఈ పని చేశాడని తేలింది. దీనితో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.