Khammam : కీచక ఉద్యోగి .. ప్రసవం కోసం వచ్చిన గర్భిణిపై అత్యాచారయత్నం
Khammam : మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి.;
Khammam : మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి.. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి.. తాజాగా ప్రసవం కోసం వచ్చిన మహిళపై ఆపరేషన్ థియేటర్‌లోనే అత్యాచారం చేయబోయాడు ఓ ఉద్యోగి.. ఈ అమానవీయ ఘటన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
ఈ దారుణాన్ని మరో వుద్యోగి అడ్డుకుని ఆ మృగాడిపై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.. అటు ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఎంఎన్‌వో లాల్ ఖాన్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో భద్రాచలంలో కలకలం రేగింది.. మానవ మృగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
ఐద్వా ఆధ్వర్యంలో ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు.. అటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్యాధికారుల బృందం ఏరియా ఆస్పత్రిలో విచారణ జరిపింది.. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.
తదుపరి విచారణ అనంతరం లాల్‌ఖాన్‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారుల బృందం తెలిపింది.