Hyderabad: మహిళపై అత్యాచారం.. ఇల్లు రెంటుకు ఇస్తానని తీసుకెళ్లి బంధించి..
Hyderabad: మలక్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇల్లు రెంటుకు ఇస్తానని తీసుకెళ్లిన కీచకుడు యువతిని బంధించి అఘాయిత్యం చేశాడు;
Hyderabad: హైదరాబాద్ న్యూ మలక్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇల్లు రెంటుకు ఇస్తానని తీసుకెళ్లిన ఓ కీచకుడు యువతిని బంధించి అఘాయిత్యం చేశాడు. సెల్‌ఫోన్ లాక్కోని, బూతులు తిడుతూ, యువతిపై దాడికి దిగాడు. తనపై కింగ్ ఖాన్ అలియాస్ హమీద్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఫ్లాట్ అండ్ ఫ్లాట్‌మేట్ గ్రూప్ ద్వారా పరిచయమై తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇదే గ్రూప్ ద్వారా చాలామందిపై అఘాయిత్యాలు జరిగినట్లు యువతి ఆరోపించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. అత్యాచారం ఘటనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు.