Adilabad: జైలులో నుండి పరారైన ఖైదీ.. తోటి ఖైదీ భార్యపై అత్యాచారం చేసి..
Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఇటీవల పరారైన ఖైదీ నాగోరావు.. మరో దారుణానికి పాల్పడ్డాడు.;
Adilabad: ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఇటీవల పరారైన ఖైదీ నాగోరావు.. మరో దారుణానికి పాల్పడ్డాడు. జైలు నుంచి పరారైన నాగోరావు తోటి ఖైదీ భార్యపై అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బాధితురాలిని రిమ్స్ కు తరలించారు. మరోవైపు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి నాగోరావుకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.. మహారాష్ట్రలోని పోర్సోడికి చెందిన నాగోరావు.. 2016లో మైనర్ బాలికను అత్యాచారం చేయగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నాగోరావు.. రెండు రోజుల క్రితం.. జైలు ఆవరణలో గార్డెనింగ్ చేస్తూ అధికారుల కళ్లుగప్పి పరారయ్యాడు.