అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. ఆందోళనకు దిగిన భార్య ..!
Wife Protest : హైదరాబాద్‌లోని బల్కంపేటలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ దీక్షకు కూర్చుంది.;
Wife Protest : హైదరాబాద్‌లోని బల్కంపేటలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ దీక్షకు కూర్చుంది. బల్కంపేట్ కు చెందిన రంగా సుధీర్, సోని భార్యాభర్తులు. ఆడపిల్ల పుట్టిందని రెండేళ్లుగా భార్యపై భర్త రంగా సుధీర్ వేధింపులకు పాల్పడుతున్నాడు. చిత్రహింసలకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామంటూ భర్త కుటుంబసభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోని వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.