KOUSHIK REDDY: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు

కరీంనగర్ పోలీస్ కమిషనర్‌పై కులం పేరుతో దూషణ.... క్షమించాలన్న కౌశిక్ రెడ్డి

Update: 2026-01-31 03:45 GMT

వీ­ణ­వం­క­లో జరి­గిన సమ్మ­క్క-సా­ర­ల­మ్మ జాతర సం­ద­ర్భం­గా బీ­ఆ­ర్ఎ­స్ ఎమ్మె­ల్యే కౌ­శి­క్ రె­డ్డి వ్య­వ­హ­రిం­చిన తీ­రు­పై భక్తు­లు, సా­మా­న్య ప్ర­జల నుం­చి తీ­వ్ర వి­మ­ర్శ­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. ని­యో­జ­క­వ­ర్గం­లో ఎక్కడ ఏ కా­ర్య­క్ర­మం జరి­గి­నా అక్కడ రచ్చ చే­య­డ­మే రా­జ­కీ­యం అన్న­ట్లు­గా ఆయన ప్ర­వ­ర్తన ఉం­టోం­ద­నే వి­మ­ర్శ­లు ఈ ఘట­న­తో మరింత బల­ప­డ్డా­యి. జా­త­ర­లో రద్దీ­ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని, హై­కో­ర్టు ని­బం­ధ­నల మే­ర­కు పరి­మిత వా­హ­నా­ల­నే అను­మ­తి­స్తా­మ­ని పో­లీ­సు­లు చె­ప్పి­న­ప్ప­టి­కీ.. ఆయన తన భారీ కా­న్వా­య్‌­తో వె­ళ్లేం­దు­కు ప్ర­య­త్నిం­చి ఉద్రి­క్త­త­కు దా­రి­తీ­శా­రు. జాతర వంటి పవి­త్ర­మైన చోట భక్తు­ల­కు ఇబ్బం­ది కల­గ­కూ­డ­ద­నే ఉద్దే­శం­తో పో­లీ­సు­లు అడ్డు­కుం­టే, దా­ని­ని రా­జ­కీ­యం చే­స్తూ రో­డ్డు­పై బై­ఠా­యిం­చి హడా­వు­డి చే­య­డం­పై సర్వ­త్రా వి­స్మ­యం వ్య­క్త­మ­వు­తోం­ది. ఒక ప్ర­జా­ప్ర­తి­ని­ధి­గా ఉండి విధి ని­ర్వ­హ­ణ­లో ఉన్న పో­లీ­సు­ల­ను మతం పే­రు­తో దూ­షిం­చ­డం, ఉన్నత స్థా­యి అధి­కా­రు­ల­ను బె­ది­రిం­చ­డం ఆయన బా­ధ్య­తా­రా­హి­త్యా­ని­కి ని­ద­ర్శ­నం­గా మా­రి­ది. జాతర ప్రాం­గ­ణం­లో కూడా దళిత మహి­ళా సర్పం­చ్‌­తో కొ­బ్బ­రి­కాయ కొ­ట్టిం­చా­ల­నే సా­కు­తో శాం­తి­భ­ద్ర­త­ల­కు వి­ఘా­తం కలి­గిం­చే­లా ప్ర­వ­ర్తిం­చ­డం కే­వ­లం రా­జ­కీయ ప్ర­యో­జ­నాల కోసం దే­ని­కై­నా సి­ద్ధ­ప­డ­తా­ర­ని క్లా­రి­టీ వచ్చి­న­ట్ల­యిం­ది. భక్తుల రద్దీ ఎక్కు­వ­గా ఉన్న సమ­యం­లో సం­య­మ­నం పా­టిం­చా­ల్సిం­ది పోయి, పో­లీ­సు­ల­పై దూ­కు­డు ప్ర­ద­ర్శిం­చి ఓవ­రా­క్ష­న్ చే­య­డం వల్ల సా­మా­న్య భక్తు­ల­కు తీ­వ్ర అసౌ­క­ర్యం కలి­గిం­ది. ఒక పక్క అమ్మ­వా­రి దర్శ­నం కోసం వేల సం­ఖ్య­లో ప్ర­జ­లు వేచి చూ­స్తుం­టే, వా­రి­ని ఇబ్బం­ది పె­డు­తూ ఇలాం­టి ర్యా­లీ­లు , ని­ర­స­న­లు చే­య­డం ఏ రక­మైన రా­జ­కీ­యం అని భక్తు­లు ప్ర­శ్ని­స్తు­న్నా­రు.

ఐపీఎస్‌ అధికారుల సంఘం ఫైర్‌

బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ఎమ్మె­ల్యే పాడి కౌ­శి­క్‌­రె­డ్డి­పై ఐపీ­ఎ­స్‌ అధి­కా­రుల సంఘం ఆగ్ర­హం వ్య­క్తం చే­సిం­ది. కరీం­న­గ­ర్‌ సీపీ గౌ­స్‌­కు వెం­ట­నే క్ష­మా­పణ చె­ప్పా­ల­ని డి­మాం­డ్‌ చే­సిం­ది. ఇటీ­వల ఎమ్మె­ల్యే పాడి కౌ­శి­క్‌­రె­డ్డి కరీం­న­గ­ర్‌ సీపీ గౌ­స్‌­పై సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. సీపీ గౌ­స్‌ మత మా­ర్పి­డు­ల­పై పా­ల్ప­డు­తు­న్నా­ర­ని అన్నా­రు. ఆ వ్యా­ఖ్య­ల­పై ఐపీ­ఎ­స్‌ అధి­కా­రుల సంఘం ఖం­డిం­చిం­ది. కౌ­షి­క్‌­రె­డ్డి చే­సిన వ్యా­ఖ్య­లు ని­రా­ధా­రం. కౌ­శి­క్‌పై చర్య­లు తీ­సు­కో­వా­లి’అని స్ప­ష్టం చే­సిం­ది. 

స్పీకర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

వీ­ణ­వంక మం­డ­లం­లో జరి­గిన మినీ మే­డా­రం సమ్మ­క్క- సా­ర­ల­మ్మ జా­త­ర­లో తనను అక్ర­మం­గా అరె­స్ట్ చే­శా­రం­టూ హు­జు­రా­బా­ద్ ఎమ్మె­ల్యే పాడి కౌ­శి­క్ రె­డ్డి తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. ఈ ఘట­న­పై బా­ధ్యు­లైన పో­లీ­సు అధి­కా­రు­ల­పై చర్య­లు తీ­సు­కో­వా­ల­ని కో­రు­తూ శు­క్ర­వా­రం శా­స­న­సభ స్పీ­క­ర్‌­కు ఆయన ప్రి­వి­లే­జ్ మో­ష­న్అం­ద­జే­శా­రు. జా­త­ర­లో ప్ర­జ­ల­తో కలి సి ఆది­వా­సీ దే­వ­త­ల­ను దర్శిం­చు­కుం­టు­న్న సమ­యం­లో, కరీం­న­గ­ర్ జి­ల్లా సీపీ, హు­జు­రా­బా­ద్ ఏసీ­పీ, జమ్మి­కుంట రూ­ర­ల్ సీఐ తనను అక్ర­మం­గా అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­ర­ని కౌ­శి­క్ రె­డ్డి ఆరో­పిం­చా­రు. ఎలాం­టి ముం­ద­స్తు నో­టీ­సు­లు ఇవ్వ­కుం­డా, చట్టా­న్ని ఉల్లం­ఘిం­చి అరె­స్ట్ చే­య­డం ప్ర­జా­స్వా­మ్య వి­రు­ద్ధ­మ­ని మం­డి­ప­డ్డా­రు. అధి­కార పా­ర్టీ ఒత్తి­డి­తో­నే పో­లీ­సు యం­త్రాం­గం ఒక శా­స­న­స­భ్యు­డి హక్కు­ల­ను కా­ల­రా­సిం­ద­ని, ఈ చర్య శా­స­న­సభ గౌ­ర­వా­న్ని దె­బ్బ­తీ­సే­లా ఉం­ద­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో­నే బా­ధ్యు­లైన అధి­కా­రు­ల­పై సభా హక్కుల ఉల్లం­ఘన కింద చర్య­లు తీ­సు­కో­వా­ల­ని స్పీ­క­ర్‌­ను కో­రి­న­ట్లు తె­లి­పా­రు.

స్పందించిన కౌశిక్ రెడ్డి

ఈ సం­ద­ర్భం­గా కౌ­శి­క్ రె­డ్డి స్పం­ది­స్తూ, అధి­కార పా­ర్టీ అం­డ­తో కొం­ద­రు అధి­కా­రు­లు వ్య­వ­హ­రి­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. రా­బో­యే మూ­డే­ళ్ల­లో రా­ష్ట్రం­లో బీ­ఆ­ర్ఎ­స్ ప్ర­భు­త్వం ఏర్ప­డ­టం ఖా­య­మ­ని, అప్పు­డు చట్టా­న్ని ఉల్లం­ఘిం­చిన ఈ అధి­కా­రు­ల­కు తగిన బు­ద్ధి చె­బు­తా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. రా­ష్ట్రం­లో, జి­ల్లా­లో కొం­ద­రు అధి­కా­రు­లు బీ­ఆ­ర్ఎ­స్ నా­య­కు­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని వే­ధి­స్తు­న్నా­ర­ని, వా­రం­ద­రి­నీ గు­ర్తు పె­ట్టు­కుం­టా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. ఐపీ­ఎ­స్ అధి­కా­రుల సం­ఘా­ని­కి బీ­ఆ­ర్‌­ఎ­స్ ఎమ్మె­ల్యే పాడి కౌ­శి­క్ రె­డ్డి క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­రు. ఈ మే­ర­కు ఎక్స్‌­లో పో­స్ట్ చే­శా­రు. ఈ వి­ష­యం­లో కొం­ద­రు పని కట్టు­కొ­ని తప్పు­డు ప్ర­చా­రం చే­స్తు­న్నా­ర­ని అన్నా­రు.

Tags:    

Similar News