మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు.. సాయం కోరినా పట్టించుకోని ప్రయాణీకులు
బెంగళూరులోని లులు మాల్‌లో జరిగిన లైంగిక వేధింపుల తరహాలోనే మెట్రో స్టేషన్ లో మరో ఘటన చోటు చేసుకుంది.;
బెంగళూరులోని మెజెస్టిక్ మెట్రో స్టేషన్ జనంతో రద్దీగా ఉంది. ఇదే అదనుగా భావించిన దుండగుడు ఓ యువతిని లైంగికంగా వేధించినట్లు సమాచారం. యువతి స్నేహితులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ రెడ్డిట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
బాధితురాలు ప్రతిరోజూ బస్సులో కాలేజీకి వెళ్లేది. అయితే ఆ రోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆమె మెట్రోలో ప్రయాణించేందుకు మెజెస్టిక్‌కు వచ్చింది. మెట్రోలో జనంతో రద్దీగా ఉంది. ఓ వ్యక్తి వెనుక నుంచి యువతిని తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట్లో ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటికే యువకుడి చర్యలు అర్థమై అక్కడే ఉన్న ప్రయాణికులు ముందుకొచ్చి సాయం కోరింది. అయినా ఒక్కరు కూడా ఆమెకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు.
ఆ తర్వాత మెట్రో పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉందని, ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని కొందరు ప్రయాణీకులు చెప్పారు. బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని కొందరు సూచించారు.