Allahabad: పిల్లలతో అసభ్యంగా మాట్లాడడం క్రిమినల్ యాక్ట్ కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..

Allahabad: గత కొంతకాలంగా పిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువయిపోయాయి.

Update: 2021-11-24 05:21 GMT

Allahabad: గత కొంతకాలంగా పిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువయిపోయాయి. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా అలాంటి నేరాలకు పాల్పడుతున్న వారికి శిక్ష వేయడానికి పోక్సో చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా పెద్దగా నేరాల సంఖ్యలో మార్పులు ఏం లేవు. అయితే పోక్సో చట్టం వల్ల నేరస్తులు ఏమీ భయపడట్లేదని ఇప్పటికే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతలోని అలహాబాద్‌ హైకోర్టు ఓ పోక్సో కేసులో సంచలన తీర్పును వెల్లడించింది.

2016లో జరిగిన ఓ ఘటన ఇది. అలహాబాద్‌లోని ఝాన్సీ ప్రాంతంలో నివసించే ఓ పదేళ్ల బాలుడిని గుడికి తీసుకెళ్తున్న అని చెప్పిన నిందితుడు.. ఆ బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడాడు కూడా. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఝాన్సీ కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే నిందితుడు చేసిన తప్పునకు ఝాన్సీ కోర్టు వేసిన శిక్ష తప్పు కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అతడు అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిపై పెట్టిన సెక్షన్లు కరెక్ట్ కాదని వాటిని కొట్టేసింది. అంతే కాక అసభ్యకరంగా మాట్లాడడం క్రిమినల్ యాక్ట్ కిందకు రాదని సంచలన తీర్పును వెల్లడించింది. ఝాన్సీ కోర్ట్ నిందితుడికి వేసిన పదేళ్ల శిక్షను రద్దుచేసి అతడికి ఏడేళ్ల జైలు శిక్షను అలహాబాద్ హైకోర్టు విధించింది.

Tags:    

Similar News