RAPE: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం... యువతిపై షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ అఘాయిత్యం;

Update: 2024-08-01 06:00 GMT

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. పుప్పాలగూడలో ఓ కంపెనీలో యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. తెలిసిన యువతి ద్వారా సిద్ధార్థ్‌ వర్మకు యువతి పరిచయమైంది. సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో సదరు యువతిని బుధవారం రాత్రి డిన్నర్‌కి తన ఇంటికి పిలిచాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనికి సంబంధించి బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఆ దారుణం మరువకముందే

కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్‌ సమీపంలో బస్సును ఆపి సీజ్‌ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహిళ అరుపులు విన్న తోటి ప్రయాణికులు 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఓయూ పీఎస్ పరిధిలో బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

మరో దారుణం

ఫేస్‌బుక్‌లో పరిచయం.. మహిళా కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యువతి యాక్సెప్ట్ చేసింది.. దీంతో యువతకి ప్రేమ పాఠాలు చెప్పాడు.. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. తన ఫోటోలని ఆమెకు పంపించాడు.. చివరికి ఆమె ఇతగాడి ప్రేమని నమ్మి ఫోటోలను పంపింది.. ఫోటోలు వీడియోలు షేరింగ్ తర్వాత పెళ్లి చేసుకుందామని అన్నారు.. దీంతో యువతి ఉప్పెంగిపోయింది.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు.. ఆస్ట్రేలియా, అమెరికా కంపెనీలో ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పాడు.. యువకుడ్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. ఇంకేముంది పెళ్లి చేసుకుందాం రా అని పిలిచాడు.. దీంతో యువతి ఏకంగా చత్తీస్‌గఢ్‌ లోని రాయపూర్ లోని తన తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒంటరిగా హైదరాబాద్ చేరుకుంది

Tags:    

Similar News