Crime News: ఎనిమిది నెలల గర్భిణి దారుణ హత్య..

Crime News: నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. ఆమె ఆడపడుచు భర్త వేటకొడవలితో నరికి చంపాడు.;

Update: 2022-09-14 08:18 GMT

Crime News: హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి దారుణహత్యకు గురైంది. ఆమె ఆడపడుచు భర్త వేటకొడవలితో నరికి చంపాడు. కుటుంబ కలహాలతో స్రవంతిని.. శ్రీరామకృష్ణ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజమహేంద్రవరానికి చెందిన వెంకట రామకృష్ణ తన భార్య స్రవంతితో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా ఉండి చిన్నమ్మ కుమార్తె.. లక్ష్మీప్రసన్నకు 2020లో శ్రీరామకృష్ణతో వివాహం జరిపించాడు. అయితే కొంతకాలానికే ఇరువురి మధ్య కలతలు చోటు చేసుకున్నాయి.

అదనపు కట్నం కోసం లక్ష్మీప్రసన్నను వేధించడంతో గత ఏడాది పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయినప్పటికీ శ్రీరామకృష్ణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో లక్ష్మీప్రసన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీరామకృష్ణ ఈనెల 6న కొండపూర్‌లో ఉంటున్న బావమరిది ఇంటికి వేట కోడవలితో వెళ్లి ఒంటరిగా ఉన్న వెంకటకృష్ణ భార్య స్రవంతిపై దాడి చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం భుజం మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన స్రవంతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Tags:    

Similar News